తూ.గో జిల్లా లో వారాహి విజయ యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసీని కోరారు.’కూటమి అభ్యర్థులను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు. త్వరలోనే ప్రభుత్వం మారబోతోందని పోలీసులు గుర్తించాలి. కూటమి అధికారంలోకి వచ్చాక పారదర్శకంగా లేని పోలీసులపై చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.దేశంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాగానే యువత బంగారు భవిష్యత్తుకు బలమైన బాటలు వేస్తాం’ అని స్పష్టం చేశారు.నన్ను పచ్చి బూతులు తిట్టినా పట్టించుకోను కానీ దళిత కులానికి చెందిన డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు వచ్చిన కోపం అంతా ఇంతా కాదు అని మండిపడ్డారు.
రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరపున ఆధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి ,రాజానగరం అసెంబ్లీ అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు, వారిని బలమైన మెజారిటీతో గెలిపించాలి పవన్ కళ్యాణ్ కోరారు.