భవిష్యత్తు నిర్ణయించే వ్యక్తి 5 ఏళ్లుగా బెయిల్ మీద బయట ఉన్నాడు : పవన్ కళ్యాణ్

-

తూ.గో జిల్లా లో వారాహి విజయ యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఖైదీ నెంబర్ 6093 మీ ముఖ్యమంత్రి, 38 కేసులు, 16 నెలలు చంచల్ గూడా జైల్లో చిప్పకూడు తిన్న వ్యక్తి, సీఎం వైఎస్ జగన్ బ్రతుకు ఎలాంటిది అంటే, ప్రతీ శుక్రవారం రాగానే వణుకు వస్తది, ఈరోజు ఎలా ఎగ్గొట్టాలి అని, మేము వచ్చాక నువ్వు ఎక్కడ కావాలి అంటే అక్కడ జైలుకు పంపిస్తాం అని మండిపడ్డారు.భవిష్యత్తు నిర్ణయించే వ్యక్తి 5 ఏళ్లుగా బెయిల్ మీద బయట ఉన్నాడు, చిన్న కేసు అంటే పాస్ పోర్ట్ ఇవ్వరు, అలాంటిది అలాంటి వ్యక్తిని ఎలా ఎన్నుకుంటారు అని ప్రశ్నించారు. 

నేను నియోజకవర్గం మార్చాను అని వైఎస్ జగన్ అంటాడు, 70 మంది ఎంఎల్ఏ లను ఎందుకు మార్చవు, నెల్లూరు వ్యక్తి ని తీసుకెళ్ళి, నరసరావు పేటలో ఎందుకు నిలబెట్టావు అని ప్రశ్నించారు. 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news