Ys Sharmila: వైఎస్ షర్మిల అప్పు రూ.82 కోట్లు చేశారట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించారు. కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిల…నిన్న నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా తన అప్పులు, ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరిచి.. ఎన్నికల అధికారులకు అందించారు. అయితే… ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇచ్చిన వివరాల ప్రకారం… తన కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ. 182 కోట్లు ఉన్నట్లు తెలిపారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి నుంచి రూ. 82.5 కోట్లు అప్పు తీసుకున్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. అలాగే, సీఎం జగన్ భార్య వైఎస్ భారతిరెడ్డికి రూ.19.5 లక్షలు బకాయిపడ్డానని అఫిడవిట్‌లో పేర్కొన్నారు షర్మిల. కాగా, బ్రదర్ అనిల్ మాత్రం తన భార్య షర్మిలకు రూ.40 కోట్లు బకాయిపడ్డారు. కాగా, నిన్న ఉదయం కడప నుంచి నామినేషన్ దాఖలు చేశారు షర్మిల. సిట్టింగ్ ఎంపీ, ఆమె ప్రధాన ప్రత్యర్థి వైఎస్సార్సీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి కూడా నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఈ కడప నియోజకవర్గంలో తమ గెలుపు ఖాయమని అభ్యర్థులిద్దరూ ధీమాతో ఉన్నారు.