తక్కువ ధరకు వడ్లు అమ్మొద్దు అని కోరారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట నియోజకవర్గం పెద్ద కోడూర్ గ్రామ పరిధిలోని మెట్టు బండల వద్ద గల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ 2203 రూపాయలు మద్దతు ధర ఇప్పిస్తా తక్కువ ధరకు అమ్మొద్దు అని చెప్పారు.
అధికారులతో మాట్లాడుత అండగా ఉంటా రైతులు అధైర్య పడొద్దు.. అడిషనల్ కలెక్టర్, ఆర్డివో, డి ఎం సివిల్ సప్లై ఐకేపీ అధికారులతో మాట్లాడటం జరిగిందన్నారు. వెంటనే వడ్ల కొనుగోలు ప్రారంభించాలని అధికారులను కోరారు. రైతులు 15 రోజులుగా కేంద్రంలో ధాన్యం ఉంచినా ప్రభుత్వం కొనడం లేదు. వర్షంతో ధాన్యం తడిచిందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే మద్దతు ధరకు ధాన్యం కొని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.