ఏపీ ఫలితాల్లో మన్యం జిల్లా స్టూడెంట్స్ టాప్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ఈరోజు విజయవాడలో పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. ఈసారి అకాడమీ ఏడాది పూర్తి కాకుండానే ఫలితాలు విడుదల చేశామని తెలిపారు. ఈ ఏడాది పదో తరగతిలో 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. మొత్తం 5,34,574 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. 89.17 శాతం మంది బాలికలు, 84.32 శాతం మంది బాలురు పాస్ అయ్యారు. ఈ ఏడాది కూడా పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి.

2803 పాఠశాలల్లో వంద శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 17 పాఠశాలల్లో సున్నా ఉత్తీర్ణత వచ్చింది. 96.37 శాతంతో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో నిలవగా.. 62.47 శాతంతో కర్నూలు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఏపీ రెసిడెన్షియల్‌, బీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 98.43 శాతం ఉత్తీర్ణత, ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో 96.72 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

Read more RELATED
Recommended to you

Latest news