ఇవాళ విజయవాడ ఎంపీగా కేశినేని నాని నామినేషన్ వేయనున్నారు. అయితే.. ఈ రోజు నామినేషన్ సందర్బంగా కుటుంబ సమేతంగా వినాయక గుడిలో ప్రత్యేక పూజలు అనంతరం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు కేశినేని నాని. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ ఎంపీ గా మూడో సారి నామినేషన్ వేస్తున్నానని చెప్పారు.

అమ్మ వారి ఆశీస్సులు తీసుకుందాం అని కుటుంబ సమేతంగా అమ్మ వారి గుడికి రావడం జరిగిందని వివరించారు. అమ్మ వారి ఆశీస్సులతో అంత మంచే జరగాలని విజయవాడ కు మంచి జరగాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు కేశినేని నాని.