BREAKING: టీవీ9 ఇంటర్వ్యూకు కేసీఆర్.. ఎప్పుడంటే ?

-

లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పటికే ఆయా పార్టీలు బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన బిఆర్ఎస్ పార్టీ ఈసారి ప్రచారంలో మాత్రం తన హవా కొనసాగిస్తుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్ అధికార పార్టీ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తు కార్యకర్తలకు ,అభ్యర్థులకు కాన్ఫిడెన్స్ను కల్పిస్తున్నారు.

వీరిద్దరికీ తోడుగా టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కూడా ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. ఇక ఎన్నికలలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ రేపు సాయంత్రం 7 గంటలకు బిగ్గెస్ట్ షో లో పాల్గొన నున్నారు. టీవీ9లో యాంకర్ రజినీకాంత్‌తో లైవ్ ఇంటర్వ్యూ కేసీఆర్ ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news