ఎన్ని చర్యలు తీసుకున్నా క్రికెట్ నుంచి పూర్తిగా దీన్ని తొలగించడంలో విఫలమవుతున్నారు. ఐపియల్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లు ఇప్పుడు ఈ ఫిక్సింగ్ మరకతో ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్ జట్టు కీలక ఆటగాడు షకిబుల్ హసన్ ని రెండేళ్ళ పాటు ఫిక్సింగ్ ఆరోపణలతో సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అక్కడ మరో కలకలం రేగింది.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ బుధవారం ప్రారంభమైంది, అయితే టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లో వెస్టిండీస్ పేసర్ కృష్ణర్ శాంటోకీ వేసిన కొన్ని బంతులు ఇప్పుడు అనుమానాస్పదంగా మారాయి. సిల్హెట్ థండర్స్ తరఫున ఆడే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సాంటోకీ లెగ్ సైడ్‌లోకి ఫుల్-టాస్ బంతి విసిరాడు… పిచ్ బయట నుంచి వెళ్లి కీపర్ చేతుల్లో పడింది. ఆ తర్వాత మరో నో బాల్ వేసాడు. ఈ బంతి క్రీజ్ కంటే అడుగు బయటపడింది. దీనిని గమనించిన అభిమానులు కొందరు వీడియోలు తీసారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.
“ఈ టి 20 టోర్నమెంట్లు బెట్టింగ్ / మ్యాచ్ ఫిక్సింగ్ యొక్క కేంద్రంగా ఉన్నాయి. ఇవన్నీ బహిరంగంగా జరుగుతాయని ఒక యూజర్ ట్విట్టర్ లో ఆరోపించాడు. ఇక మరొకరు ఇది ఫిక్సింగ్ లా ఉందని వ్యాఖ్యానించారు. “త్వరలో ఐసిసి మిడ్-ఓవర్ ఫీల్డ్కు పోలీసులను పంపవచ్చు” అని ఒక వినియోగదారు చమత్కరించారు. “అతను బౌల్ చేసిన నో-బాల్ అనుమానాస్పదంగా ఉంది. అతను (శాంటోకీ) ను ఇంకా బిసిబి పిలవలేదు, కాని నేను నా ఫిర్యాదు చేశాను. ఈ విషయంపై దర్యాప్తు చేయమని సిఇఒ మరియు మోర్షెడ్ (బిసిబి అవినీతి నిరోధక అధిపతి) ను తాను కోరినట్టు సిల్హెట్ థండర్స్ జట్టు డైరెక్టర్ తంజిల్ చౌదరి తెలిపారు.
A no-ball bowled by Krishmar Santokie in the opening match of the Bangladesh Premier league #BPL2019 today. pic.twitter.com/Lvzut5d0Gz
— Nikhil Naz (@NikhilNaz) December 11, 2019