నాది ప్రోగ్రెస్ రిపోర్ట్.. బాబుది బోగస్ రిపోర్ట్ : సీఎం జగన్

-

నాది ప్రోగ్రెస్ రిపోర్ట్.. బాబుది బోగస్ రిపోర్ట్ అని ఏపీ సీఎం జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా టంగుటూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు సీఎం జగన్. నాయకుడు అంటే.. ప్రజల్లో ఒక నమ్మకం ఉండాలని.. ఒక మాట చెబతే కచ్చితంగా చేసి తీరతాడని ప్రజలు భావించాలన్నారు. చంద్రబాబుకు ఓటు వేయడమంటే మళ్లీ మోసపోవడమే అన్నారు.

14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకు రాదు.. ఓటేసే ముందు ఎవరిదీ బోగస్ రిపోర్టు.. ఎవరిది ప్రోగ్రెస్ రిపోర్టు అనేది తప్పకుండా చూడాలన్నారు. జాబ్ రావాలంటే బాబు రావాలి అనే మాటలు గుర్తుకున్నాయా..? ఇంటింటికి ఉద్యోగం ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు ముష్టిలాగా ఉద్యోగాలిచ్చారు. కేవలం 31వేల ఉద్యోగాలిచ్చారు. వైసీపీ ప్రభుత్వం 58నెలలకాలంలో 2లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మనది ప్రోగ్రెస్ కార్డు.. చంద్రబాబుది బోగస్ కార్డు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news