జి మెయిల్ లో ఈ ఫీచర్స్ తెలుసా…?

-

ఈ రోజుల్లో జి మెయిల్ అనేది అత్యవసరంగా మారిపోయింది… ప్రతీ రోజు ఏదోక సందర్భంలో ప్రతీ ఒక్కరు ఏదోక విధంగా వాడుతూనే ఉన్నారు. దీనితో సంస్థ కూడా వినియోగదారులకు అనుకూలంగా… ఎప్పటికప్పుడు సరికొత్తగా తన సేవలను అందిస్తుంది… 15 ఏళ్ళ క్రితం అందుబాటులోకి వచ్చిన ఈ మెయిల్ సర్వీస్… దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకు మందికి పైగా వాడుతున్నారని సంస్థ అంచనా… ఈ నేపధ్యంలో ఒక్కసారి… ఈ మెయిల్ లో ఉన్న ప్రత్యేకమైన ఫీచర్లు ఏంటి అనేది ఒకసారి చూస్తుంది.

షెడ్యూల్ మెయిల్, సెల్ఫ్ డిస్ట్రక్ట్ మెయిల్, అన్‌సెండ్ మెయిల్స్, జీమెయిల్ ఆఫ్‌లైన్ ఇలా కొన్ని ఫీచర్లు సంస్థ అందిస్తుంది.

షెడ్యూల్ మెయిల్; దీని ద్వారా మెయిల్ చెయ్యాలి అనుకుంటే… ఏ సమయం అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో… ఆ సమయంలో షెడ్యుల్ చేసుకుని పెట్టుకుంటే చాలు… ఇలా 100 మెయిల్స్ షెడ్యుల్ చేసుకునే అవకాశం ఉంటుంది. మెయిల్ సెండ్ చేసే సమయంలో పక్కన… ఆప్షన్స్ లో షెడ్యుల్ ఉంటుంది… ఇక షెడ్యుల్ చేసిన వాటిని డిలీట్ చేసే సదుపాయం కూడా ఉంటుంది.

సెల్ఫ్ డిస్ట్రక్ట్ మెయిల్: మీరు పంపిన మెయిల్‌ ని కొంత సమయం తర్వాత డిలీట్ చెయ్యాలి అంటే దీనిని వాడుకోవచ్చు… ఒక రోజు నుంచి అయిదేళ్ళ వరకు… మీరు సెలెక్ట్ చేసిన సమయం తర్వాత మెయిల్ మాయం అయిపోతుంది. కంపోజ్ క్లిక్ చేసిన తర్వాత క్లాక్ ఐకాన్ పైన క్లిక్ చేసి… సమయం పేర్కొంటే చాలు.

అన్‌సెండ్ మెయిల్స్; ఈ ఫీచర్ ద్వారా మీరు పంపిన మెయిల్‌ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. అయితే దానికి టైం లిమిట్ ఉంది. మీరు మెయిల్ పంపగానే మీకు Undo, view message అనే ఆప్షన్స్ కనపడగానే… మీరు undo ఎంపిక చేసుకుంటే మళ్ళీ కంపోజ్ ఓపెన్ అవుతుంది. ఈ సమయాన్ని మీరు సెట్టింగ్స్‌లో సెలెక్ట్ చేసుకోవాలి… 5, 10, 20, 30 సెకండ్లు మాత్ర౦ ఆ సమయం ఉంటుంది.

జీమెయిల్ ఆఫ్‌లైన్; ఇంటర్నెట్ లేకపోయినా మెయిల్ చదవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అయితే గూగుల్ క్రోమ్ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. జీమెయిల్ ఆఫ్‌లైన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి enable offline mail పై క్లిక్ చేస్తే ఎన్ని రోజుల మెసేజెస్ కావాలంటే అన్ని సింక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

జిమెయిల్ లిఫీ; దీని ద్వారా మీ నాన్ జీమెయిల్ అకౌంట్‌లో కూడా మీరు జీమెయిల్‌ ఫీచర్స్ ని వాడుకునే అవకాశం కలుగుతుంది. ఈ ఫీచర్ మీరు వాడుకోవాలి అంటే… మీ అకౌంట్‌ని జీమెయిల్‌కు చేస్తే… జీమెయిల్ ఇన్‌బాక్స్‌లో ఆ ఫీచర్స్ అన్నీ కనిపిస్తాయి. టాప్ రైట్‌ లో సెట్టింగ్స్ క్లిక్ చేసి మీ నాన్ జీమెయిల్ అకౌంట్‌ని లింక్ చెయ్యాలి…

Read more RELATED
Recommended to you

Latest news