నేడు మహబూబాబాద్ జిల్లా లో కేసీఆర్ రోడ్డు షో కొనసాగనుంది. భద్రాద్రి కొత్తగూడెం నుంచి మహబూబాబాద్ రానున్నారు కేసీఆర్. ఇల్లందు రోడ్డులోని ధరణి ఆసుపత్రి నుండి ఇందిరాగాంధీ సెంటర్ వరకు రోడ్డు షోలో పాల్గొంటారు కేసీఆర్.

అనంతరం ఇందిరాగాంధీ సెంటర్ లో సాయంత్రం 6 గంటలకు కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. అనంతరం మహబూబాబాద్ నుండి రాత్రి వరంగల్ కి చేరుకోనున్నారు కేసీఆర్. రాత్రి వరంగల్ లోనే బస చేయనున్నారు కేసీఆర్. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది.