సలార్-2 నుంచి క్రేజీ అప్డేట్.. పార్ట్-2లో బాలీవుడ్ హీరోయిన్!

-

పాన్ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. కేజీయఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘సలార్ పార్ట్- 1’ బ్లాక్బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. తొలి భాగానికి కొనసాగింపుగా ‘శౌర్యాంగ పర్వం’ పేరుతో రెండో పార్ట్ తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తోంది.

సలార్ పార్ట్-2లో ఓ బాలీవుడ్ హీరోయిన్ నటిస్తోందట. బీ టౌన్ బ్యూటీ కియారా అడ్వాణీ ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఉందట. రెండో పార్ట్లో ఆమె ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు సమాచారం. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కియారాతో ఓ స్పెషల్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నాడట. అయితే పార్ట్-2లో కియారా పాత్ర సెంకడ్ హాఫ్లో ఎంట్రీ ఇస్తుందని టాక్. ప్రభాస్- కియారా జోడీ బిగ్ స్క్రీన్పై సందడి చేస్తుంటే క్రేజీగా ఉంటుందని డార్లింగ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news