ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌కు ఒకప్పుడు కంచుకోట. కానీ ఇప్పుడు కనీసం ఆ స్థానానికి అభ్యర్థిని కూడా ఖరారు చేయలేదు. అయితే ఈ స్థానం నుంచి పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె రాహుల్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అమేఠీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్మృతి.. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఇలా ఎప్పుడైనా జరిగిందా? పోలింగ్‌కు ఇంకా 27 రోజులే ఉంది. కానీ, ఇంకా కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించకపోవడం వారి అహంకారానికి నిదర్శనం అని మండిపడ్డారు. ఈ స్థానంపై రాహుల్ గాంధీ బావ (రాబర్ట్ వాద్రాను ఉద్దేశిస్తూ) కన్నేశారని, ఇప్పుడు రాహుల్ కర్చీఫై వేసుకోవాలేమో అంటూ ఎద్దేవా చేశారు. ఐదో విడత పోలింగ్‌లో భాగంగా అమేఠీ స్థానానికి మే 20వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. సిట్టింగ్ ఎంపీగా ఉన్న స్మృతి ఇరానీ వరుసగా రెండో సారి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.