ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీల్లో మార్పులు చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ముందుగా 2024 మే 24 నుండి జూన్ 1 వరకు ఉన్న పరీక్షల తేదీలను..మే 24 నుండి జూన్3 వరకు పరీక్షల తేదీలను మార్చింది . మే 27న నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉంది. ఈ నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లుగా తెలుస్తుంది.ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు ఒకే రోజున నిర్వహిస్తారు.
ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్ట్ ఈయర్ పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 వరకు ఇంటర్ సెకండ్ ఈయర్ పరీక్షలు జరగనున్నాయి.సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఇటీవలే ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలు వెలువడగా,ఫస్టియర్ ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో టాప్ లోనిలవగా..సెకండియర్ రిజల్ట్ లో ములుగు జిల్లా అత్యధిక ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్ లో 60.01 శాతం , సెకండియర్ లో 64.19 శాతం ఉత్తీర్ణత సాధించారు.