తీవ్ర స్థాయిలో మోడీ పై విరుచుకుపడ్డ చిదంబరం..!

-

కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మోడీ మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. వారసత్వ పన్ను అనే పదం మా మేనిఫెస్టోలో ఎక్కడా కనబడట్లేదని కానీ బీజేపీ నాయకులు మోడీ కావాలనే మేనిఫెస్టో మీద కల్పిత వ్యాఖ్యలతో విమర్శలు చేస్తున్నారని చిదంబరం అన్నారు. టాక్స్ మీద కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు క్లియర్ గా ఉన్నాయని నిష్పక్షపాత పన్ను పరిపాలన్ని అందిస్తామని చిదంబరం చెప్పారు.

మోడీ ప్రభుత్వం ద్వంద్వ సెస్ ని అంతం చేసి దుకాణదారులు రిటైల్ వ్యాపారులకి పన్ను మినహాయింపులు ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. ప్రధాని ఊహాజనిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందపరిచిన అసలు అంశాల మీద ఆయన చర్చించాలి అని చిదంబరం చెప్పారు. మేనిఫెస్టోలో పౌరసత్వ సవరణ చట్టం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినప్పటికీ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని రద్దు చేస్తామని చిదంబరం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news