వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైయస్ షర్మిల సూటి ప్రశ్న

-

వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టో -2024పై విమర్శల పర్వం కొనసాగుతోంది. 2019లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మరోసారి జనాలను నమ్మించే ప్రయత్నం చేశారంటూ విపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . ఇక ఈ క్రమంలో ఏపీసీసీ వైఎస్ షర్మిల కూడా తన గొంతు కలిపారు. ” మీ హామీలను ప్రజలు ఎందుకు నమ్మాలి” అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఆమె సూటి ప్రశ్న వేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా వైఎస్ షర్మిల ఆదివారం స్పందించారు.

”మీకు, మీ మాటకు విలువ లేదు. అలాగే మీ మేనిఫెస్టోకి విలువ లేదు” అంటూ వైసీపీ పై షర్మిల ధ్వజమెత్తారు. 2019లో ఇచ్చిన హామీలపై మాట నిలబెట్టుకోలేదని, ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంటే ఎవరు నమ్ముతారు? అని ప్రశ్నించారు. ”మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీత అని ప్రమాణం చేసిన మీర అందులో చెప్పిన ఒక్క అంశం నెరవేర్చలేదు అని మండిపడ్డారు. ప్రజలు మీ హామీలను ఎందుకు నమ్మాలి?” అని ఆమె నిలదీశారు. ”కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా తెస్తానని హామీ ఇచ్చిన మీరు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు” అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news