నేడు రాష్ట్రానికి రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

-

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సందడి ఊపందుకుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో బిజీగా ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తోంది. వరుసగా కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు రంగంలోకి దిగి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వచ్చారు. ఇక తాజాగా ఈరోజు ఎన్నికల ప్రచారం నిమిత్తం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి రానున్నారు.

కొత్తగూడెం, మహబూబాబాద్లో బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్వహించే బహిరంగ సభల్లో నడ్డా పాల్గొననున్నారు. సాయంత్రం మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి కుత్బుల్లాపూర్ నిజాంపేటలో నిర్వహించే రోడ్ షోకు హాజరుకానున్నారు. రోడ్ షో అనంతరం హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గాల ముఖ్యనేతలతో నడ్డా సమావేశం కానున్నారు. సమావేశం ముగించుకున్న తరువాత రాత్రి హైదారాబాద్లోనే బస చేసి మరుసటి రోజు దిల్లీకి పయనం కానున్నారు. నడ్డా పర్యటనతో రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లలో నిమగ్నమయింది. ఆయన సభకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బీజేపీ నేతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news