భట్టి విక్రమార్క కాదు, వట్టి విక్రమార్క – KCR

-

భట్టి విక్రమార్క కాదు, వట్టి విక్రమార్క అంటూ సెటైర్లు పేల్చారు KCR. ఖమ్మం నియోజక వర్గంలో కేసీఆర్‌ మాట్లాడుతూ….మహబూబ్ నగర్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తా ఉంటే అక్కడ రెండు సార్లు కరెంట్ పోయింది, నేను కరెంట్ పోయింది అని చెప్పిన, నన్ను ఇబ్బంది పెట్టాలని తీసేసిర్రా లేక వారి అసమర్ధతనొ ఎందో కరెంట్ పోయింది.. దాని గురుంచి నేను ట్విట్టర్లో పెడితే అది చూసిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేసీఆర్ చెప్పింది అబద్ధం అన్నారని ఆగ్రహించారు.

kcr fires in bhatti vikramarka

ఇవ్వాలా ఉస్మానియా యూనివర్సిటీలో చీఫ్ వార్డెన్ గారు కరెంట్ కొరత నీళ్ల కొరత ఉంది హాస్టల్స్ ముసేస్తున్నం అని విద్యార్దులను ఇంటికి వెళ్ళండి అని ఒక సర్క్యులర్ విడుదల చేశారని వెల్లడించారు. ఈరోజు మళ్ళీ చీఫ్ వార్డెన్ సర్కులర్ పెట్టీ ఉస్మానియా యూనివర్సిటీకి నీళ్లు కరెంట్ ఇచ్చే దిక్కులేదు అని ట్విట్టర్ లో పెట్టిన, పెట్టగానే చీఫ్ వార్డన్ కి నిన్ను ఎందుకు సస్పెండ్ చేయొద్దో వివరణ ఇవ్వండి అని నోటీస్ ఇచ్చారని తెలిపారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news