BREAKING: కేంద్రమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫేక్ వీడియో షేర్ చేయడం పై మండిపడ్డ అమిత్ షా… ఫేక్ వీడియో షేర్ వెనుక రాహుల్ హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అధికారం కోసం నిరాశలో నా ఫేక్ వీడియో షేర్ చేస్తున్నారని నిప్పులు చెరిగారు అమిత్ షా.
రాజకీయాలను రాహుల్ గాంధీ దిగజరుస్తున్నారని ఫైర్ అయ్యారు అమిత్ షా. రాహుల్ గాంధీ అసత్యాలను ప్రచారం చేస్తున్నారని… ఫేక్ వీడియో ప్రచారాలు ఎప్పుడు ఇలా జరగలేదని వివరించారు అమిత్ షా. ఎన్నికల మేనిఫెస్టో ఆధారంగా రాహుల్ ఎన్నికల్లో పోటీ చేయాలి..ఫెక్ వీడియో సర్క్యులేట్ చేసి కాదని చురకలు అంటించారు.