ఉపయోగించని బ్యాంకు ఖాతాల వల్ల ఏదైనా సమస్య ఉంటుందా..?

-

ఒకప్పుడు బ్యాంకు అకౌంట్‌ తీసుకోవాలన్నా, క్రెడిట్‌ కార్డులు తీసుకోవాలన్నా చాలా టైమ్‌ పడుతుంది. అంత కష్టపడి తీసుకుంటాం కాబట్టి వాటిని జాగ్రత్తగా అవసరం మేరకే వాడేవాళ్లు. కానీ ఇప్పుడు బ్యాంకు అకౌంట్‌ కూడా ఇంట్లో ఉండే ఓపెన్‌ చేయొచ్చు. అందుకే చాలా మంది ఇష్టం వచ్చినట్లు అప్పటి అవసరాల కోసం బ్యాంకు అకౌంట్లు ఓపెన్‌ చేస్తున్నారు. కొన్నాళ్లు వాడిన తర్వాత వాటిని పక్కనపడేస్తున్నారు. ఇలా మనం వాడని బ్యాంకు అకౌంట్ల ద్వారా మనకు ఏదైనా సమస్య వస్తుంది అని కూడా  ఎవ్వరికీ తెలియదు. కానీ నిజంగా సమస్య వస్తుందా అంటే నిపుణులు ఇచ్చే సమాధానం ఇదే..!
ఉపయోగించని బ్యాంక్ ఖాతాలను ఇన్-ఆపరేటివ్ లేదా డోర్మాంట్ ఖాతాలు అంటారు. ఇలా వాడకపోతే మన బ్యాంకు ఖాతాలకు కొన్ని ప్రమాదాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక మోసం మరియు పన్ను ఎగవేత విషయానికి వస్తే, మొదటి బాధితులు ఈ ఇన్-ఆపరేటివ్ మరియు డోర్మాంట్ ఖాతాలు. ముఖ్యంగా నగదు బదిలీ మోసాలు జరిగినప్పుడు మోసగాళ్లు ఇలాంటి ఖాతాలను హ్యాక్ చేసి వినియోగిస్తారని చెబుతున్నారు. అంతే కాదు మనీలాండరింగ్, డ్రగ్స్, మనుషుల అక్రమ రవాణాకు కూడా ఇలాంటి ఖాతాలు ఉపయోగపడతాయని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
కాబట్టి మనం ఉపయోగించని ఖాతాల వివరాలను తెలుసుకోవాలి. అందులో అసాధారణంగా ఏదైనా జరిగితే వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం అందించాలి. కారణం ఏమిటంటే, మన ఉపయోగించని బ్యాంక్ ఖాతా ఏదైనా ఆపదలో చిక్కుకున్నప్పుడు, పోలీసులు మమ్మల్ని కూడా విచారిస్తారు. కాబట్టి ఉపయోగంలో లేదన్న విషయాన్ని పట్టించుకోకుండా బ్యాంకును ఆశ్రయించి తగిన చర్యలు తీసుకుంటే మంచిది. ఇది చిన్న విషయంగా అనిపించినా, దాని వల్ల కలిగే సమస్య చాలా పెద్దదనే విషయాన్ని మర్చిపోకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news