మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి డమ్మీ అభ్యర్థి : కేటీఆర్

-

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో భాగంగా గడపగడపకు వెళ్తూ.. తమ పార్టీ చేసిన మంచి పనులను వివరిస్తూ, ఓటేయాలని ఓటర్లను కోరుతున్నారు.ఇందులో భాగంగానే.. బీఆర్ఎస్ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా.. గురువారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూకట్పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్.

కూకట్పల్లిలో బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఊపే పార్లమెంటు ఎన్నికల్లో ఉందని,మళ్ళీ కేసీఆర్ రావాలి అంటే పార్లమెంట్కి.. 10 నుండి 12 సీట్లు గెలిపిస్తే 6 నెలల్లో సాధ్యమౌతుందని అన్నారు .కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, హైదరాబాద్లో నాలుగు సార్లు కరెంటు పోతుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త పరిశ్రమలు రావడం కాదు.. ఉన్నా పరిశ్రమలు పోతున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి డమ్మీ అభ్యర్థి అని విమర్శించారు. అధికారం కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ,చేసింది ఏమీ లేదని మండిపడ్డారు.16 అసెంబ్లీ స్థానాలు ఇచ్చిన నగర వాసులను మరిచిపోమని కేటీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news