వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. తొలి రోజు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే .రెండో రోజు నలుగురు అభ్యర్థులు తమ నామపత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. దీంతో ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికకు దాఖలైన నామినేషన్ల సంఖ్య ఏడుకు చేరింది.
కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కు మార్, అలియన్స్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ తరఫున ఈడ శేషగిరిరావు, స్వతంత్ర అభ్యర్థులుగా మాదవపెద్ది వెంకట్‌రెడ్డి, చాలిక చంద్రశేఖర్ తమ నామపత్రాలను నల్గొండ కలెక్టరేట్‌లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ములుగు జిల్లా అదనపు కలెక్టరు, ఎమ్మెల్సీ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మహేందర్‌కు అందజేశారు. ఈ నెల 9వ తేదీ వరకు నామినేషన్ల క్రతువు కొనసాగనుంది.