వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. శనివారం బాపట్ల జిల్లా రేపల్లెలో ఆయన మాట్లాడుతూ..ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఎంతటి ప్రజలకు అర్థమైందంటూ జగన్ వ్యవహరశైలిపై ధ్వజమెత్తారు. ఈ అరాచక ప్రభుత్వంలో అందరూ ఇబ్బందులు పడ్డారని అన్నారు. కనీసం రైతుల సాగునీటి అవసరాలను కూడా తీర్చని ప్రభుత్వంగా ఖ్యాతి గాంచిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఇక రేపల్లెలో పర్యాటకం బాగా అభివృద్ధి చేయవచ్చునని, కానీ పేకాట క్లబ్లులు తప్ప పర్యాటకం గురించి వైసీపీ పాలకులు పట్టించుకోలేదని మండిపడ్డారు. రేపల్లె సాగునీటి డ్రైనేజీ వ్యవస్థకు నిధులు వచ్చినా సద్వినియోగం చేయలేదని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు.. ల్యాండ్ గ్రాబింగ్ చట్టమని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. ఒంటిమిట్టలో ఓ కుటుంబం ఈ చట్టం కారణంగా చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు పవన్.