గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలి : కేసిఆర్

-

గెలిచిన ఓడిన ప్రజల కోసమే పనిచేస్తూ ఉండాలని కెసిఆర్ అన్నారు.కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌కు మద్దతుగా వీణవంకలో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…”అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తాత్కాలికమే అని అన్నారు. రాజకీయాల్లో ఉన్నవారికి గెలుపోటములు సహజం. గెలిస్తేనే లెక్క అనుకోవద్దు. గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలి అని సూచించారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు వచ్చే విధంగా కష్టపడ్డాను అని తెలిపారు. రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చేందుకు ఎంతో కృషి చేస్తే,కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్‌ నుంచి అనేక పరిశ్రమలు వెళ్లిపోవాలని యోచిస్తున్నాయి అని అన్నారు.2001లో తెలంగాణ జెండా ఎత్తిన రోజు పెద్ద పెద్ద నాయకులు లేకపోయినా ఎక్కువ మంది జడ్పీటీసీలు, ఎంపీపీలను గెలిపించిన గడ్డ హుజూరాబాద్‌ అని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం అయి పోలేదు.. ఇంకా ఉంది. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగాల్సిన అవసరముంది అని తెలిపారు. నాలుగైదు నెలల్లోనే ఈ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయింది” అని కేసీఆర్‌ మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Latest news