ఏ దేశాల్లో ప్రజలు ఎక్కువ కాలం జీవించగలరు.. లిస్ట్‌లో ఫస్ట్‌ ఉన్న దేశం ఏది..?

-

ఈరోజుల్లో మనిషి ఆయుర్దాయం సగటును 60- 70 సంవత్సరాల వరకే ఉంటుంది. పల్లెల్లో అయితే ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. మనిషి ఎంత కాలం జీవించగలడు అనేది వాళ్లు నివసిస్తున్న ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కువ ఆయుర్దాయం ఉందో చూద్దాం.

సింగపూర్ : అధునాతన వైద్య వ్యవస్థ మరియు సగటు ఆయుర్దాయం 84.39తో, ఎక్కువ కాలం జీవించే దేశాల జాబితాలో సింగపూర్ 7వ స్థానంలో ఉంది.

స్విట్జర్లాండ్ : చాలా సురక్షితమైనది, శాంతియుతమైనది మరియు సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన స్విట్జర్లాండ్ సగటు ఆయుర్దాయం 84.52తో 6వ స్థానంలో ఉంది.

లీచ్‌టెన్‌స్టెయిన్ : ఉన్నత జీవన ప్రమాణాలు కలిగిన దేశం, లీచ్‌టెన్‌స్టెయిన్ సగటు ఆయుర్దాయం 84.92తో 5వ స్థానంలో ఉంది. ఇక్కడి ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారు.

జపాన్ : 5వ స్థానంలో జపాన్ ఉంది. ఇక్కడి ప్రజలు చురుకైన జీవనశైలిని నడిపిస్తారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా తింటారు.. ఈ దేశం యొక్క సగటు ఆయుర్దాయం 85.08 సంవత్సరాలు.

మకావు : మకావు సగటు ఆయుర్దాయం 85.65 సంవత్సరాలు, అత్యధిక ఆయుర్దాయం ఉన్న దేశాలలో 6వ స్థానంలో ఉంది. ఈ చైనా దేశం కూడా అత్యంత ధనిక దేశం.

హాంకాంగ్ : హాంకాంగ్ సగటు ఆయుర్దాయం 85.96తో మొదటి 2 స్థానంలో నిలిచింది. అత్యధిక జనాభా కలిగిన ఈ దేశంలో ఆయుర్దాయం కూడా పెరిగింది.

మొనాకో : సగటు ఆయుర్దాయం 87.14తో ఎక్కువ కాలం జీవించే దేశాల జాబితాలో మొనాకో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ మహిళలు 93 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించగలరు. ఇక్కడ పురుషులు 85 సంవత్సరాల వరకు జీవించగలరుట.

Read more RELATED
Recommended to you

Latest news