ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పలువురు అధికారులను తొలగించడం.. మార్పులు, చేర్పులు చేయడం వంటివి తెలంగాణ కాస్త ఎక్కువగా జరుగుతున్నాయనే చెప్పాలి. తాజాగా ఏపీ లోని అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి పై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశాలు జారీ చేసింది.
ఆయనకు ఎన్నికలు అప్పగించవద్దని ఉన్నతాధికారులకు ఆదేశించింది. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది. ఇటీవల అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ ను ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో అమిత్ బర్దర్ ను నియమించింది.