ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కేవలం వారం రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈ వారం చాలా కీలకం కావడంతో ఒకరిపై మరొకరు నేతలు విమర్శించుకుంటున్నారు. తాజాగా మాచర్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చంద్రబాబు ఏ రోజుకూడా మాట మీద నిలబడి చరిత్ర లేదన్నారు.
రాబోయే ఐదేళ్లలో ఇంటింటి భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలన్నారు సీఎం జగన్. చంద్రబాబుకు ఓటు వస్తే చంద్రముఖి మళ్ళీ నిద్ర లేచి లక లక లక అని రక్తాన్ని పీల్చుతుందన్నారు. గతంలో ఇచ్చిన మేనిఫెస్టోను చంద్రబాబు అమలు చేయలేదని.. మళ్లీ కొత్త మేనిఫెస్టో తీసుకొచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము 2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశామని తెలిపారు. కేవలం 59 నెలల్లోనే మేనిఫెస్టోని అమలు చేసిన ఘనత వైసిపి ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు. పొరపాటున చంద్రబాబు మాయమాటలు విని మోసపోకండి.. ఒక్కసారి ఆలోచించి ఓటేయండి. ఎవరి వల్ల మీకు మేలు జరుగుతుందో ఆలోచించి వారికే ఓటేయండి అని సూచించారు సీఎం జగన్.