అభ్యంతరకర వీడియోలున్న 25వేల పెన్‌డ్రైవ్‌లను పంచారు: కుమారస్వామి

-

పార్లమెంట్ ఎన్నికల వేళ కర్ణాటక సెక్స్ స్కాండల్ దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. కన్నడ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ వ్యవహారంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు అభ్యంతరకర వీడియోలున్న 25వే ల పెన్‌డ్రైవ్‌లను పంచారని విమర్శించారు. ఈ కుట్ర వెనక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉన్నారని ఆరోపించారు.

మొదట బెంగళూరు రూరల్‌ నియోజకవర్గంలో ఏప్రిల్‌ 21వ తేదీన ఒక పెన్‌డ్రైవ్‌ను విడుదల చేశారని కుమారస్వామి అన్నారు. ఆ రోజు రాత్రి ఒక వాట్సాప్‌ ఛానల్‌ను క్రియేట్ చేసి అందులో ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు వీక్షించేందుకు ఈ ఛానల్‌ను ఫాలో అవండని మెసేజ్ పెట్టారని చెప్పారు .ఆ వీడియోల్లో ఉన్న దేనినీ తాను సమర్థించడం లేదని చెబుతూనే.. చట్టపరంగా తప్పు చేసినవారికి శిక్ష పడాలని అన్నారు. వీడియోలను వ్యాప్తి చేసిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదై 15 రోజులు అవుతున్నా ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news