మావోయిస్టు క‌మాండ‌ర్ రామ‌న్న అంత్య‌క్రియ‌లు..!

-

అనారోగ్యంతో మృతి చెందిన మావోయిస్టు క‌మాండ‌ర్ రామ‌న్న అంత్య‌క్రియ‌లు మావోయిస్టులు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ మేరుకు రామ‌న్న అంత్య‌క్రియ‌ల‌కు చెందిన ఫోటోలు.. వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. రామ‌న్న అంత్య‌క్రియ‌ల్లో భారీ ఎత్తున గిరిజ‌న ప్ర‌జ‌లు పాల్గొని జోహార్లు ఆర్పించారు. చ‌త్తీస్ ఘ‌డ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో టైఫాయిడ్ జ్వ‌రంలో మావోయిస్టు క‌మాండ‌ర్ రామ‌న్న మృతి చెందిన విష‌యం పాఠ‌కుల‌కు తెలిసిందే. గ‌త నాలుగు రోజుల క్రితం రామ‌న్న మృతి చెందిన‌ట్లుగా మావోయిస్టు పార్టీ అధికార ప్ర‌తినిధి విక‌ల్ప్ మీడియాకు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

అయితే రామ‌న్న మృతి చెంద‌డంతో ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. చ‌త్తీస్‌ఘ‌డ్ లోని సుక్మా బీజాపూర్ సరిహద్దులో రామన్న అంత్యక్రియలు నిర్వ‌హించారు. రామన్న అంత్యక్రియలులో మవోయిస్టులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు. అంత్య‌క్రియ‌లు బీజాపూర్ అడ‌వుల్లోని ఓ న‌ది ప్రాంతంలో నిర్వ‌హించారు. అంత్యక్రియ‌ల్లో పాల్గొన్న మావోయిస్టులు, గ్రామస్తులు భారీగా నివాళులు అర్పించారు. రామ‌న్న కోసం ప్ర‌త్యేకంగా రెడిమెడ్ స్థూపాన్ని నిర్మించారు.

ఎర్ర‌ని క్లాత్‌తో స్థూపం నిర్మించి స్టూపంపై రామ‌న్న ఫోటోను ఏర్పాటు చేశారు. స్థూపం పై భాగంలో సుత్తే కొడ‌వ‌లి ని ఏర్పాటు చేశారు. సాయుధులైన మావోయిస్టులు, ప్ర‌జ‌లు రామ‌న్న మృతికి సంతాపంగా నెత్తిపై చేతులు పెట్టుకుని జోహార్ రామ‌న్న అంటూ నినాదాలు చేశార‌ని తెలుస్తుంది. అంతేకాదు రామ‌న్న మృత‌దేహాన్ని యాత్ర‌గా తీసుకెళ్ళి అంత్య‌క్రియ‌లు జ‌రుప‌డం విశేషం.

రామ‌న్న స్థూపం, ఆయ‌న అంతిమ‌యాత్ర ఫోటోలు ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి. మావోయిస్టులు చ‌నిపోతే గుట్టు చ‌ప్పుడు కాకుండా అంతిమ‌యాత్ర‌లు నిర్వ‌హించేవారు మావోయిస్టులు. కానీ రామ‌న్న మృత‌దేహంను ఊరేగింపుగా తీసుకెళ్తున్న ఫోటోల‌ను, స్థూపాన్ని మావోయిస్టు పార్టీ విడుద‌ల చేయ‌డం విశేష‌మే. మావోయిస్టు పార్టీ నేత రామ‌న్న మృతి త‌రువాత అంత్య‌క్రియ‌లు పూర్తి అయినట్లు అధికార ప్ర‌తినిధి విక‌ల్ప్ అధికారికంగా ప్ర‌క‌టించారు. దీనితో పాటు ఫోటోల‌ను విడుద‌ల చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news