రాష్ట్రమంతా 144 సెక్షన్ అమలు : సీఈవో వికాస్ రాజ్

-

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో సీఈఓ వికాస్ రాజ్ పార్లమెంటు ఎన్నికలపై లేఖ విడుదల చేశారు. ‘సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ రాష్ట్రం అంతటా అమలు అవుతుంది. నలుగురి కంటే తక్కువ వ్యక్తులు తిరుగొద్దు. ఎలక్ట్రానిక్ మీడియా లో ఎలాంటి ప్రచారం ఆరు గంటల నుంచి చేయొద్దు. జూన్ 1వ తేది సాయంత్రం 6.30 నిమిషాల వరకు బ్యాన్ ఉంటుంది. కొన్ని సంస్థలు మే 13వ తేదీన సెలవు ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఆ రోజు సెలవు ఇవ్వకపోతే చర్యలు ఉంటాయి. కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్, హెూటల్స్ లలో ఉన్న ఇతర జిల్లాల వ్యక్తులు వెళ్లిపోవాలి.

రేపు, ఎల్లుండి పేపర్లలో ప్రకటనల కోసం ముందస్తు అనుమతి తీసుకోవాలి. 160 కేంద్ర కంపెనీల బలగాలు రాష్ట్రంలో ఇప్పటికే మొహరించాయి. ఇతర రాష్ట్రాల నుంచి 20వేల పోలీస్ బలగాలు మోహరించాయి. ప్రతీ పార్లమెంట్ సెగ్మెంట్ లో రెండేసి బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో 232 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి EVM తరలించే వాహనాలకు GPS ఉంటుంది. సీఈఓ ఆఫీస్ మానిటరింగ్ చేస్తోంది. 320 కోట్ల సిజింగ్ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. 8600 FIR లు రాష్ట్ర వ్యాప్తంగా చేశారు.

లక్ష 90వేల మంది పోలింగ్ విధుల్లో సిబ్బంది డైరెక్ట్ గా పాల్గొంటున్నారు. మొత్తం 3లక్షల మంది ఉన్నారు. 48 గంటల పాటు వచ్చే ఫిర్యాదుల పై 100 నిమిషాల్లో చర్యలు ఉంటాయి. బల్క్ MSM ఇవ్వాళ సాయంత్రం 6 గంటల నుంచి బంద్ చెయ్యాలి. 1లక్ష 88 వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇప్పటి వరకు ఫోల్ అయ్యాయి. 21,680 మంది ఓటర్లు హెూం ఓటింగ్ వేసుకున్నారు. 1950 నంబర్ కి eci స్పెస్ EPIC నంబర్ పెడితే ఓటర్ కు డిటైల్స్ వస్తాయి. 328 పోలింగ్ కేంద్రాలు. ఏజెన్సీ ఏరియాల్లో ఏర్పాటు చేశాము.. మూడు పోలింగ్ కేంద్రాలు అత్యల్పంగా ఓటర్లు ఉన్నవి ఉన్నాయి’ అని తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news