కాగితాల మీద చూడకుండా జిల్లాల పేర్లు చెప్పగలరా ? .. ముఖ్యమంత్రికి మోడీ సవాల్

-

కాగితాల మీద చూడకుండా ఒడిశాలోని జిల్లాల పేర్లు చెప్పగలరా అని ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సవాలు విసిరారు.ఒడిశాలోని కంధమాల్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ… తాను చేస్తున్న ఈ ఛాలెంజ్.. నవీన్ పట్నాయక్‌కు ఓ సీఎంగా రాష్ట్రం గురించి ఎంత పరిజ్ఞానం ఉందో తెలుపుతుందని మోదీ అన్నారు.

”మీ ముఖ్యమంత్రి ను కాగితాల సాయం లేకుండా రాష్ట్రంలోని జిల్లాల పేర్లు, వాటి కేంద్రాల పేర్లు చెప్పమనండి. ఆయన పేర్లనే చెప్పలేకపోతే ఇక మీరు పడుతున్న బాధను ఎలా తెలుసుకుంటారు” అని మోడీ ప్రశ్నించారు. ఆర్థిక రంగంలో ప్రాముఖ్యత గురించి,పర్యటక రంగంలో ఒడిశాకు ఉన్న అవకాశాల గురించి మోదీ వివరించారు. పోఖ్రాన్ అణు పరీక్ష వంటి చారిత్రాత్మక సంఘటనలను ఉటంకిస్తూ ప్రధాని ఇండియా సార్థ్యాన్ని కొనియాడారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరుస్తానని,రాబోయే ఎన్నికలు ఒడిశా అభివృద్ధికి ఎంతో కీలకమైనవని మోడీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news