తాడిపత్రిలో ఘర్షణలపై మూడు కేసులు నమోదు

-

తాడిపత్రిలో ఘర్షణలపై మూడు కేసులు నమోదు అయ్యాయి. తాడిపత్రిలో పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణలపై మూడు కేసులు నమోదు చేశారు. గాయపడిన కానిస్టేబుల్ కమల్ భాష ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన కుమారుడు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు జెసి అష్మిత్ రెడ్డి లతోపాటు మరికొందరిపై 147 148 188 353 332 r/w149 ipc,125 R.P యాక్ట్ కింద కేసు నమోదు అయింది.

Three cases have been registered for clashes in Tadipatri

జేసి అష్మిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన కుమారులు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, కేతిరెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి లతోపాటు మరో వంద మంది పై 147,148,506,188,324,427,r/w 144 ఐపీసీ సెక్షన్లు 125 RP యాక్ట్ కింద కేసు నమోదు అయింది. కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఫిర్యాదు మేరకు జేసీ అష్మిత్ రెడ్డి,జెసి ప్రభాకర్ రెడ్డి,దీపక్ రెడ్డి,జెసి పవన్ కుమార్ రెడ్డి లతోపాటు మరి కొంతమంది పై 147,148,506,188,324,427,r/w 144 ఐపీసీ సెక్షన్లు,125 RP యాక్ట్ కింద కేసు నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news