పాక్ ఆక్రమిత కశ్మీర్ మనది కదా? అని అన్నారు. మణిశంకర్ అయ్యర్, ఫరూఖ్ అబ్దుల్లా మాత్రం పాకిస్థాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని అంటున్నారని చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి మాట్లాడకూడదని చెప్పి తమను భయపెట్టేవారని తెలిపారు.
రాహుల్ బాబా, మమతా దీదీ ఎంత భయపడినా ఫర్వాలేదని అన్నారు. పీవోకే మనదని, ఆ ప్రాంతాన్ని మళ్లీ తీసుకుంటామని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్లో ఇంతకు ముందు కొందరు నిరసనలు తెలిపేవారని అన్నారు. ఇప్పుడు ప్రధాని మోదీ ప్రభావంతో అక్కడ హర్తాళ్లు వంటివి జరగడం లేదని చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో మాత్రం ఇటువంటివి జరుగుతున్నాయని తెలిపారు. ఇంతకు ముందు జమ్మూకశ్మీర్ లో స్వతంత్రం కావాలంటూ నినాదాలు వినపడేవని, ఇప్పుడు పీవోకేలో వినపడుతున్నాయని చెప్పారు.