జగన్‌ కోతల రాయుడు…వైసీపీ సింగిల్‌ డిజిట్‌ కే పరిమితం – బొండా ఉమా

-

జగన్ మోహన్ రెడ్డి కోతల రాయుడు…..సింగిల్ డిజిట్ ఫలితాలకు పరిమితం అవ్వడం ఖాయం అన్నారు బొండా ఉమా. 175 సీట్లు సాధించి రికార్డు సృష్టిస్థాను అంటున్న జగన్….ఓడిపోతే వైసీపీ పార్టీని మూసి వేస్తానని చెప్పే ధైర్యం ఎందుకు లేదు….? అంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఓకే అంటే ఫలితాల కంటే ముందే టీడీపీలో చేరేందుకు వైసీపీ నేతలు రెడీగా వున్నారని బాంబ్‌ పేల్చారు.

వైసీపీ పాలనలో జగన్ తప్ప ఎవరు బాగుపడలేదు….కనీసం కౌంటింగ్ ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. ఓటమి ఖాయమని తెల్సి జగన్, మంత్రులు అప్పుడే ఏడుపు ముఖం పెట్టారు….ఈ ఆఫీస్ ఫైల్స్ అప్ గ్రేడ్ పేరుతో రహస్య జీవోలు, నోట్ ఫైల్స్ ను మాయం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపణలు చేశారు. IAS,IPS అధికారుల్ని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నంలో భాగంగా కనిపిస్తోందని ఫైర్ అయ్యారు. పల్నాడు, అనంతపురం ఎస్పీలు, కలెక్టర్ లు సరెండర్ చూసిన తర్వాత అయిన బ్యూరో క్రాట్లు కళ్ళు తెరవాలి….ప్రభుత్వం చెప్పిందని నిబంధనలు ఉల్లంఘించిన తెలంగాణ అధికారులు జైళ్లకు వెళ్ళిన తీరును గమనించండన్నారు బొండా ఉమా.

Read more RELATED
Recommended to you

Latest news