రైతులకు గుడ్ న్యూస్. కర్షకులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం “ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి” అనే పథకాన్ని తీసుకొచ్చింది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన కేంద్రం.. ఈ స్కీమ్ ద్వారా రైతులకు పంట సాయంగా ఎకరానికి ఏటా 6 వేల రూపాయలు అందిస్తోంది. ఏప్రిల్- జులై తొలి విడతగా, ఆగస్టు- నవంబర్ రెండో విడతగా, డిసెంబర్-మార్చి మూడో విడతగా.. 2 వేల చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సాయం అందిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పీఎం కిసాన్ పథకం ద్వారా 16 సార్లు నిధులు విడుదల చేసింది. ఇప్పుడు 17వ విడత నిధులు విడుదల కావాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం.. పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు మే నెల చివరి వారంలో లేదా జూన్ నెల మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఈ సారి e- kyc పూర్తి చేసిన వారికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బు అకౌంట్లో జమ అవుతుందనే చర్చ కూడా సాగుతోంది. అలాగే బ్యాంక్ ఖాతా కూడా ఆధార్‌తో లింక్ అయ్యి ఉండాలట.