5వ దశ పోలింగ్ సర్వం సిద్ధం..ఈ స్థానాలలోనే ఎన్నికలు

-

5వ దశ పోలింగ్ సర్వం సిద్ధం అయ్యాయి. ఐదో దశ పోలింగ్‌కు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం అంటే 20వ తేదీన 5వ దశ పోలింగ్ జరుగనుంది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. 49 నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం ముగిసింది ప్రచారం.

5th phase polling is all ready

ఇక యూపీలో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్‌లో 7 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఒడిశాలో 5, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 3 నియోజకవర్గాలకు రేపు పోలింగ్ ఉంటుంది. జమ్ముకశ్మీర్‌లో 1, లడక్‌లో 1 స్థానానికి రేపు పోలింగ్ ఉండనుంది. కాంగ్రెస్‌కు కీలక స్థానాలు రాయబరేలీ, అమేథిలో రేపు పోలింగ్ నిర్వహిస్తున్నారు. రాయబరేలీలో రాహుల్‌, అమేథిలో కేఎల్ శర్మ పోటీ ఉంటుంది. బరిలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, స్మృతి ఇరానీ, సాధ్వి నిరంజన్‌ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news