రేపు తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు 2024

-

తెలంగాణలో వరుసగా పరీక్షల ఫలితాలు విడుదలవుతున్నాయి. ఇప్పటికే పది, ఇంటర్, ఈఏపీసెట్ ఫలితాలు విడుదల కాగా తాజాగా ఈసెట్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా.. పాలిటెక్నిక్‌  డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌ , బీ – ఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్‌ ఫలితాలను ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నారు. ఆరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఛైర్మన్‌  లింబాద్రి ఫలితాలను విడుదల చేస్తారని ఈసెట్‌ కన్వీనర్‌ తెలిపారు.

మరోవైపు తెలంగాణ ఈఏపీ సెట్‌ ఫలితాలు శనివారం రోజున విడుదలయ్యాయి. హైదరాబాద్​లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను ప్రకటించారు. ఈ పరీక్షలో ఇంజినీరింగ్‌లో 74.98 శాతం , అగ్రికల్చర్‌, ఫార్మసీలో 89 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. ఈ పరీక్షకు 3,32,251 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు 91,633 మంది, ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది పరీక్ష రాశారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news