పల్నాడులో అల్లర్ల కేసుల విచారణ కొనసాగుతోంది. నేడు పల్నాడులో సిట్ బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. మాచర్ల, వెల్దుర్తి ప్రాంతాల్లో విచారణ చేయనుంది సిట్ బృందం. గురజాల నియోజకవర్గంలో వందకు పైగా కేసులు నమోదు అయ్యాయి. 192 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది.అత్యధికంగా దాచేపల్లి మండలం 70, పిడుగురాళ్ల మండలం 62 మందిపై కేసులు అయ్యాయి. పిడుగురాళ్ల మండలంలో 67 మందిపై ఐపీసీ 307, 324, 323 కింద కేసు నమోదు అయ్యాయి.
సత్తెనపల్లి నియోజకవర్గంలో 34 కేసులు..దాదాపు 70 మంది నిందితులను గుర్తించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో 5 కేసులు నమోదు.. 99 మంది నిందితులలను గుర్తించారు. నరసరావుపేట నియోజకవర్గంలో 20 పైగా కేసు.. 60 మంది నిందితులను గుర్తించారు. నరసరావుపేట వన్ టౌన్ లో జరిగిన గొడవలకు సంబంధించి 11 మందిపై ఐపీసీ 147, 148, 324 కింద కేసు నమోదు అయింది. నరసరావుపేట రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ లో, పదికి పైగా కేసులు నమోదు అయింది. పోలింగ్ రోజున చెలరేగిన హింసలో నిందితుల గుర్తింపు కోసం సిసి ఫుటేజ్ పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ లు నమోదైన నిందితులతో పాటు వీడియోల ఆధారంగా మరికొన్ని పేర్లు చేర్చే అవకాశం ఉంది.