యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం

-

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ ఆదివారం సెలవు రోజు కావడంతో  కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున వచ్చారు.  ఆలయ పరిసరాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారి దర్శనానికి చాలా మంది క్యూలైన్‌లో బారులు తీరారు. యాదాద్రీశుడి నామస్మరణతో ఆలయ మాఢ వీధులన్నీ మార్మోగుతున్నాయి.

తమకు మంచి కలగాలని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి సుమారు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతోందని యాడా అధికారులు తెలిపారు. వేసవిలో ఎండతాపానికి గురి కాకుండా భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించామని వెల్లడించారు. నీటి వసతి, చలువ పందిళ్లు వేసినట్లు చెప్పారు. ఆదివారం కావడం వల్ల భారీ ఎత్తున భక్తులు యాదాద్రీశుడి వద్దకు తరలివచ్చారని పేర్కొన్నారు. మరోవైపు  ప్రసాద విక్రయ శాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్, బస్టాండ్‌లో భక్తుల సందడి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news