బ్రేకింగ్‌ : మూడు రాజధానులపై వైసీపీలో భిన్న స్వరం… ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

-

అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజు ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు వచ్చే అవకాశం ఉందని చేసిన ప్రకటన ఇప్పుడు దుమారం రేపుతుంది. ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటనపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా ఈ నిర్ణయం దుమారం రేపడమే కాకుండా ప్రజల్లో కూడా నిరసనలకు దారి తీసింది అని రాజధాని ప్రాంతంలో బంద్ ని చూస్తే అర్ధమవుతుంది.

జగన్ ఉండొచ్చు అనే ప్రకటనకే ఈ స్థాయిలో స్పందన రావడం వైసీపీ నేతలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా దీనిపై.. నరసరావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజధాని అంతా ఒక ప్రాంతంలో ఉండాలి అన్నదే తన అభిమతం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. విశాఖను ఆర్ధిక రాజధాని చెయ్యాలన్న ఆయన… అసెంబ్లీతో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కూడా,

అమరావతిలోనే ఉండాలి అనేది తన అభిమతం అని… పరిపాలన మొత్తం ఒక చోట నుంచే జరగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇదే విషయాన్ని జగన్ కి కూడా చెప్తామన్నారు. కమిటి నివేదిక వస్తుందని… అప్పుడు తమ ఆలోచన జగన్ దృష్టికి తీసుకుని వెళ్తామని అన్నారు… అందరి సలహాలతోనే ముందుకి వెళ్తామని చెప్పారు. ఇప్పుడు ఆయన చేసిన ప్రకటన తీవ్ర దుమారం రేపుతుంది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి అన్నదని తమ అభిమతం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news