పెట్రోల్ బంక్ లోనే పేలిన లారీ డిజీల్ ట్యాంక్..!

-

పెట్రోల్ బంక్ లో డిజీల్ కొట్టించుకునేందుకు వచ్చిన లారీ డిజిల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలింది. దీంతో అక్కడున్న వారంతా పరుగో పరుగో పెట్టారు. కానీ.. పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న ఓ వ్యక్తి మాత్రం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. పేలిన డిజిల్ ట్యాంక్ నుండి చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు ముందుక వచ్చాడు. బంక్ లో ఉన్న ఫైర్ సెఫ్టీ పరికారాలను ఉపయోగించి ట్యాంకర్లో చేలరేగిన మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేశాడు. అయితే.. ఒక్కడే ఇదంతా చేస్తున్నా.. అక్కడ ఉన్న వారు ప్రమాదం నుంచి బయటపడేందుకే ప్రయత్నించారు తప్పా తనకు సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. కొంత సేపటికి పెట్రోల్ బంక్లో పనిచేసే మరో వ్యక్తి తనతో కలిసి మంటలను పూర్తి ఆర్పివేశారు. దీంతో అక్కడ పెను ప్రమాదం తప్పింది. స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

యాదాద్రిలోని నాయర పెట్రోల్ బంక్లో చోటు చేసుకుంది.  పెట్రోల్ బంక్ లోకి వచ్చిన లారీ ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. “అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే మంటలను ఆర్పే యంత్రాన్ని తీసి మంటలను ఆర్పారు. డయల్ 100 లేదా ఫైర్ డిస్ట్రెస్ కాల్స్ చేయలేదు” అని భువనగిరి పోలీసులు తెలిపారు. భువనగిరి నుంచి నల్గొండ రహదారిలో ఉన్న నయారా పెట్రోల్ బంక్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. మంటలు చల్లార్చడంలో ఏమాత్రం అశ్రద్ధ వహించిన భారీ ప్రమాదం జరిగి ఉండేది. ఈ మధ్య తరచూ ఏదో ఓ చోట అగ్నిప్రమాదాలు జరుగుతుండగం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. వేసవి కాలం నేపథ్యంలో మంటలు వేగంగా అంటుకుంటున్నాయి. అగ్నిమాపక అధికారులు ప్రమాదాల నివారణకు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Latest news