నెతన్యాహు, హమాస్ నేతలపై అరెస్ట్ వారెంట్!

-

ఇజ్రాయెల‌్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో పాటు హమాస్‌ నేతలపై అరెస్టు వారెంట్ జారీ చేయాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ అన్నారు. గాజా స్ట్రిప్‌లో నెతన్యాహు, ఇజ్రాయెల్‌ రక్షణమంత్రి యోవా గాలెంట్‌ యుద్ధ నేరాలకు పాల్పడ్డారని, వీరి వల్ల ఎంతో మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మంది మహిళలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని వాపోయారు.

అక్టోబరు 7న ఇజ్రాయెల్‌ పౌరులపై పాల్పడిన నేరాలకు హమాస్‌ నేతలు యహ్యా సిన్వర్‌, మహమ్మద్‌ డెయిఫ్‌, ఇస్మాయిల్‌ హనియాపై అరెస్టు వారెంట్లు జారీ చేయాలని చీఫ్ ప్రాసిక్యూటర్ కరీమ్ఖాన్ అభ్యర్థించారు. వారు చేసిన మెరుపు దాడులతో ఎంతోమంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారని పిటిషన్‌లో ఆరోపించారు. ప్రాసిక్యూటర్‌ వినతిపై ఐసీసీ విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది.

ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కరీమ్ ఖాన్ చేసిన ఆరోపణలను ఇజ్రాయెల్, అమెరికా తీవ్రంగా ఖండించాయి. ఇది దారుణమైన విజ్ఞాపన అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మండిపడ్డారు. మరోవైపు ఐసీసీకి కరీమ్‌ఖాన్‌ చేసిన విజ్ఞప్తిపై హమాస్‌ కూడా ఆక్షేపణలు తెలిపింది. ఈ చర్య బాధితులను, తలారిని ఒకే గాటన కట్టినట్లుందని విమర్శించింది.

Read more RELATED
Recommended to you

Latest news