తెలంగాణ ప్రజలకు షాక్..అప్పటి వరకు నో రేషన్ కార్డు అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తేల్చి చెప్పేశారు. ఎన్నికల కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు.

”అర్హులందరికీ కొత్త పెన్షన్లు కూడా ఇస్తాం. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తాం. అన్ని గ్రామాల్లో పాఠశాలలు, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తాం. ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం” అని ఆయన హామీ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.