తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తున్న నకిలీ బ్రాండ్లు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ యంగ్ లీడర్ మన్నె క్రిశాంక్ వెల్లడించారు. సోమ్ డిస్టిలరీస్ కంపెనీ తయారు చేసిన కల్తీ మందు తాగి మధ్యప్రదేశ్‌లో 24 మంది చనిపోయారని… కల్తీ మందు తయారు చేస్తున్నారని మధ్యప్రదేశ్‌లో ఈ సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థను బ్యాన్ చేశారని పేర్కొన్నారు మన్నె క్రిశాంక్.
సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు విరాళాలు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ సంస్థ మందును తెలంగాణలో అమ్మడానికి అనుమతి ఇచ్చారన్నారు మన్నె క్రిశాంక్. సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ మందు అమ్ముకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. కానీ మంత్రి జూపల్లి కృష్ణారావు మందు అమ్ముకోవడానికి ఏ కంపెనీ దరఖాస్తు చేసుకోలేదు అని అన్నాడని వివరించారు మన్నె క్రిశాంక్. అంటే మంత్రి జూపల్లి అబద్దం ఆడుతున్నాడా? లేక రేవంత్ రెడ్డి మంత్రికి తెలియకుండా డీల్ చేస్తున్నాడా? అంటూ ప్రశ్నించారు మన్నె క్రిశాంక్.