YCP రెండోసారి అధికారంలోకి వస్తే విశాఖలోనే ప్రమాణస్వీకారం చేసి అక్కడి నుంచే పరిపాలన ఉంటుందని సీఎం జగన్ ప్రకటించారు. జూన్ తర్వాత మంచి ముహూర్తం చూసి YCP స్టేట్ ఆఫీసు కూడా విశాఖకు షిఫ్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇక మీదట YCP యాక్టివిటీస్ అన్నీ విశాఖ నుంచే సాగుతాయని చెబుతున్నారు. అటు పాలనా రాజధానిగా మాత్రమే కాకుండా రాజకీయ రాజధానిగా విశాఖను ఉంచాలని ప్రయత్నిస్తోంది. ఇక అటు జగన్ ప్రమాణ స్వీకారానికి తేదీతో పాటు టైమ్ కూడా ఫిక్స్ చేశారు వైవీ సుబ్బారెడ్డి. తాజాగా మీడియాతో వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడారు.
జూన్ 9 ఉదయం 9 నుండి 11 లోపు జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం విశాఖలోనే ఉంటుందని ప్రకటించారు వైవీ సుబ్బారెడ్డి.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలు ఎంత విశ్వాసంతో ఉన్నారో పోలింగ్ రోజు చూసామని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో ఎండను వానలు లెక్కచేయకుండా వచ్చి ఓటు వేశారంటే దాని అర్థం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అని తెలిపారు. అత్యధిక స్థానాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు వైవీ సుబ్బారెడ్డి.