ఎన్నికల తర్వాత కాస్త సేదతీరేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పది రోజుల పాటు అక్కడ విశ్రాంతి తీసుకున్న చంద్రబాబు తాజాగా స్వదేశానికి చేరుకున్నారు. హైదరాబాద్కు చేరుకున్న చంద్రబాబుకు పార్టీ నేతలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.
విదేశీ పర్యటనను ముగించుకుని బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చంద్రబాబు వచ్చారు. పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. ఏపీలో ఎన్నికల ప్రచారం, పార్టీ వ్యవహారాలతో బిజీగా గడిపిన చంద్రబాబు.. విశ్రాంతి కోసం ఈనెల 19వ తేదీన విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే.
మరోవైపు చంద్రబాబు మాత్రమే కాకుండా చాలా మంది నేతలు పోలింగ్ పూర్తైన మరుసటి రోజే విదేశాలకు వెళ్లారు. ఇక కౌటింగ్ సమయం దగ్గర పడుతుడంటంతో వీదేశీ పర్యటనలో ఉన్న నేతలు స్వదేశానికి పయనమయ్యారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి విదేశీ పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు.