జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇదే..!

-

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల వేడుకలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు షెడ్యూల్ ఖరారు చేశారు.దశాబ్ది వేడుకల సందర్భంగా జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి ఉదయం గన్పార్క్ ని అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పిస్తారు. అనంతరం ఉ.10 గంటలకు పరేడ్ గ్రౌండ్లో త్రివర్ణ పతాకం ఎగురవేస్తారు. పోలీసు బలగాల పరేడ్, మార్ఫాస్ట్ తర్వాత అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ట్యాంక్ బండ్ పై నిర్వహించే వేడుకలకు సీఎం హాజరవుతారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కూడా పాల్గొంటారు.

కాగా, ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఉద్యమకారులతో సహా రాష్ట్రంలోని ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కూడా ఆహ్వానం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేసీఆర్‌కు ఆహ్వాన పత్రికను అందించాలని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌కు, డైరెక్టర్ అరవింద్ సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news