పాక్-ఆసీస్ మధ్యే ఫైనల్… నాథన్ లయన్ పై ఫ్యాన్స్ ఆగ్రహం

-

జూన్‌ 2 నుంచి 29 వరకూ జరిగే T20 మెగా టోర్నీ కి అమెరికా, వెస్ట్ ఇండీస్ ఆథిత్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీ కోసం ఇప్పటికే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.కెనడాతో యూఎస్‌ఏ టోర్నీ ఆరంభ మ్యాచ్‌ను ఆడనుంది.

ఇదిలా ఉంటే… T20 ప్రపంచకప్ 2024లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు ఫైనల్లో తలపడుతాయని ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ అభిప్రాయపడ్డారు. ‘పాకిస్థాన్ జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. బాబర్, రిజ్వాన్ లాంటి స్టార్ బ్యాటర్లకూ కొదవలేదు. పాక్ తో పాటు ఆస్ట్రేలియా కచ్చితంగా ఫైనల్ చేరుతుంది’ అని ఆయన అన్నారు .కాగా ఆయన భారత్ పేరెత్తకపోవడంతో టీమిండియా ఫ్యాన్స్ లయన్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాగా, టీమిండియా జూన్ 5న తన మొదటి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news