KCR Will Goto Gunpark: బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవ వేడుకలు జరపాలని నిర్ణయించింది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు గన్ పార్క్ వద్ద కేసీఆర్ నివాళులు అర్పించనున్నారు.
అనంతరం గన్ పార్క్ నుండి అమరజ్యోతి వరకు 10 వేల మందితో భారీ ర్యాలీ చేపట్టనున్నారు. ర్యాలీలో పాల్గొననున్న కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు పాల్గొంటారని సమాచారం. కాగా, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ చుట్టూ కంచెలు ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. అధికారంలోకి రాగానే కంచెలు తొలగిస్తాం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ చుట్టూ కంచెలు బిగిస్తోందంటూ బీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఆగ్రహిస్తున్నారు.