ప్రజ్వల్ రేవణ్ణ మరోసారి ఎంపీగా గెలుస్తాడు : ఇండియా టుడే

-

మహిళలపై అత్యాచారం, కిడ్నాప్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మరోసారి ఎంపీగా విజయం సాధిస్తారని India Today Axis My India తెలిపింది. హాసన్ స్థానం నుంచి ఆయన రెండోసారి గెలుపొందుతారని అంచనా వేసింది. ప్రజ్వల్పై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయస్ పటేల్కు ఓటమి తప్పదని జోస్యం చెప్పింది.

ఇక ఈ ఎన్నికలకు సంబంధించిన అధికారిక ఫలితాలు ఈనెల 4వ తేదీన వెలుపడతాయి. కాగా హాసన్ స్థానానికి ఎన్నిక పూర్తయ్యాక సెక్స్ కుంభకోణం కేసు వెలుగుచూసిన విషయం తెలిసిందే.లైంగిక వేధింపుల ఆరోపణలు రావడానికి ఒకరోజు ముందు ప్రజ్వల్ రేవణ్ణ దౌత్యపరమైన పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి ఇండియా నుంచి పారిపోయారు. ఇన్ని రోజులు దేశం విడిచి బయట ఉన్న ప్రజ్వల్ ఇప్పుడు ఇండియాకి తిరిగి వచ్చాడు. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ రేవన్నను పోలీసులు అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news